ఏ సినిమాకైనా గెలుపోటములు కామన్. సక్సెస్ అయిన సినిమాని ఆహా ఓహో అంటారు. ప్లాప్ అయిన సినిమాని పోయింది అని ఒక్క ముక్కతో తేల్చేస్తారు, కానీ పనిగట్టుకుని పదే పదే చంపెయ్యడం అనేది చాలా దారుణం. అదే దారుణం ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో జరుగుతుంది. విజయ్ దేవరకొండ పై ఉన్న నెగిటివిటీని ఫ్యామిలీ స్టార్ పై చూపించడం అనేది నిజంగా దారుణం కాక ఇంకేమవుతుంది.
సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అనే హాష్ టాగ్ తో పాటుగా.. Family Star Flops: Vijay Deverakonda Film Dips by 45% on Day 2 అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మొదటి రోజు విజయ్ కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఫ్యామిలీ స్టార్ కి రెండోరోజు మరింత డల్ కలెక్షన్స్ వచ్చాయంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి సినిమా ప్లాప్ అని చెప్పొచ్చు కానీ.. ఇలా పదే పదే చెప్పడమే రౌడీ ఫాన్స్ కి బాధాకర విషయం.అటు దిల్ రాజు కూడా బావున్న సినిమాని చంపెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వాదిస్తున్నారు.
విజయ్ దేవరకొండ పై ఎంత హేట్నెస్ లేకపోతె ఈ రకమైన పబ్లిసిటీ చేస్తారు. ఫ్యామిలీ స్టార్ పై విషం చిమ్ముతారా.. ఫ్యామిలీ స్టార్ అంత చెత్త మూవీ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమందికి నచ్చుతుంది. కాని ఇలా పనిగట్టుకుని సినిమాని చంపెయ్యడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే వాదన సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది.