టిల్లు గాడు సెంచరీ కొట్టాడు. క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్స్ మాన్ సెంచరీ కొడితే గ్యాలరీలో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ గొప్పగా సెలెబ్రేట్ చేసుకుంటారు. టీవీ లు చూసే క్రికెట్ లవర్స్ అయితే పండగ చేసుకుంటారు. అదే బాక్సాఫీసు వద్ద సెంచరీ అంటే 100 కోట్లు కొడితే.. అది కూడా అస్సలు ఊహించని సినిమా 100కోట్ల క్లబ్బులోకి వెళితే అది నిజంగా సెలెబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అందుకే టిల్లు గాడు రేపు అంటే సోమవారం సాయంత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా టిల్లు స్క్వేర్ డబుల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు తోనే సూపర్ సక్సెస్ అందుకోగా.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో 100 కోట్ల క్లబ్బులోకి కాలు పెట్టి నిర్మాత నాగవంశీ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఓ కామెడీ ఎంటర్టైనర్ ఇలా 100 కోట్లు తేవడం ఆశ్చర్యం, ఆనందం, నోట మాటకూడా రావడమే లేదు.
మార్చ్ 29 న విడుదలైన టిల్లు స్క్వేర్ సౌండ్ ఇంకా ఇంకా బాక్సాఫీసు వద్ద మోగుతూనే ఉంది. వారం పూర్తయ్యిందో లేదో.. 100 కోట్లు కొల్లగొట్టి అఫీషియల్ గా పోస్టర్ వేసి పండగ చేసుకుంటుంది. దానితో టిల్లు గాడు సెంచరీ కొట్టడంటూ నెటిజెన్స్ ఉత్సాహం గా ట్వీట్లు వేస్తున్నారు.