Advertisement
Google Ads BL

సీక్రెట్ కాదు ప్రైవేట్ అంతే: సిద్ధార్థ్


గత వారం హీరో సిద్దార్థ్-హీరోయిన్ అదితి రావు లు ఓ గుడిలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు, అది కూడా తెలంగాణలోని ఓ గుడిలో, తమిళ అర్చకుల చేత తమ వివాహాన్ని గుట్టు చప్పుడు కాకుండా, ఎవ్వరికి తెలియకుండా చేసుకున్నారంటూ వచ్చిన వార్త మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తమది సీక్రెట్ పెళ్లి కాదు.. జస్ట్ ఎంగేజ్మెంట్ అంటూ అదితి రావు సిద్దు తో ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్ ని షేర్ చేసింది. 

Advertisement
CJ Advs

తాజాగా హీరో సిద్దార్థ్ తమ సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై స్పందించాడు. సీక్రెట్ గా నిశ్సితార్ధం ఏమిటండి, సీక్రెట్ కి ప్రైవేట్ కి చాలా తేడా ఉంది. మేము ఎవరినైతే మా ఎంగేజ్మెంట్ కి పిలవలేదో వాళ్లే మా నిశ్చితార్ధం సీక్రెట్ అనుకున్నారు. నిజం చెప్పాలంటే మాది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్. ఇదేమి షూటింగ్ కాదు డేట్ చెప్పడానికి, ఇది లైఫ్ టైమ్ డేట్, పెద్దల అంగీకారంతో, వారు నిర్ణయం బట్టి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏం జరగాలంటే అది అదే సమయంలో జరుగుతుంది అని సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు సిద్దు. 

ఇక అదితి మీ ప్రపోజల్ కి ఎస్ చెప్పడానికి ఎంత సమయం తీసుకుంది అని అడిగితే.. ఇలాంటివి నన్ను అడగొద్దు, ఎందుకంటే ఎస్ or నో అనే ఫైనల్ రిజల్ట్ నాకు ముఖ్యం. అదితి ఎస్ చెబుతుందా, లేదా అని నేను చాలా టెన్షన్ పడ్డా, కానీ ఫైనల్ గా అదితి నాకు ఎస్ చెప్పింది అంటూ సిద్దార్థ్ మొదటిసారి అదితి తో రిలేషన్ పై ఓపెన్ అయ్యాడు. 

It's not secret, it's private: Siddharth:

It was not shooting..., Siddharth breaks silence on secre engagement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs