Advertisement
Google Ads BL

కేసీఆర్‌పై రేవంత్ రివెంజ్.. చర్లపల్లి జైలే!


బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రివెంజ్ తీర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారా..? గులాబీ బాస్ అధికారంలో ఉన్నప్పుడు.. తనను ఎలాగైతే ఇబ్బందులకు గురిచేశారో.. ఇప్పుడు అదేలాగనే కేసీఆర్‌ను చేయడానికి రంగం సిద్ధం చేశారా..? అంటే పదే పదే రేవంత్ చేస్తున్న కామెంట్స్‌ను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. అంతేకాదండోయ్.. చర్లపల్లికి జైలుకు పంపుతానని స్వయంగా రేవంతే ప్రకటించడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement
CJ Advs

అసలేం జరుగుతోంది..?

అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అష్టకష్టాల్లో ఉన్న బీఆర్ఎస్‌కు మరో ఊహించని షాకే తగలబోతోందని స్పష్టంగా అర్థం అవుతోంది. ఓ వైపు ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోవడం.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకుందామని ప్లాన్ చేస్తున్న కేసీఆర్‌కు.. కుమార్తె కవిత అరెస్ట్‌తో పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లయ్యింది. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కారు దిగి కాంగ్రెస్, కాషాయ కండువా కప్పుకోవడంతో కేసీఆర్‌కు అన్నీ వరుస షాక్‌లు తగిలాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో ఇక పార్టీ మనుగడ లేకుండా పోతుందేమో అని గ్రహించిన కేసీఆర్.. రైతన్నల బాధలను తెలుసుకోవడానికి పొలం బాట పట్టారు. వర్షాలు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నాలుగైదు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం.. వ్యక్తిగతంగా మాట్లాడుతుండటంతో రేవంత్‌కు ఎక్కడో గట్టిగానే మండినట్టయ్యింది.

ఈ కేసులో అరెస్టా..?

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను కేసీఆర్ చిత్ర హింసలు పెట్టారన్నది జగమెరిగిన సత్యమే. ఆ తర్వాత పలు కేసులు జోడించి నెలల తరబడి చర్లపల్లి జైలులో ఉంచారు కూడా. దీంతో మునుపెన్నడూ లేని క్రేజ్ రేవంత్‌కు వచ్చేసింది.. కొద్దిరోజుల్లోనే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కూడా వచ్చింది. ఇక మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్లుగా రేవంత్ రెచ్చిపోయారు. కేసీఆర్ అంటే చాలు ఒంటికాలిపై లేచేవారు. నాటి నుంచి తెలంగాణలో తనకు ఉన్న ఏకైక శత్రువు, బద్ధ శత్రువు కేసీఆరే అన్నట్లుగా రేవంత్ ప్రవర్తిస్తూ వచ్చారు. సీన్ కట్ చేస్తే.. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవి చూడటం.. కాంగ్రెస్ గెలవడం, సీఎంగా రేవంత్ ప్రమాణం చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. పైగా ఇప్పుడు కాళేశ్వరం, రైతు బంధు, ధరణి, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలతో పెద్ద కుంభకోణాలు, కేసులే పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో బీఆర్ఎస్‌లో వణుకు మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రేంజ్‌లో సంచలనంగా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ కేసులో ఇప్పటికే కీలక అరెస్టులు (పోలీసు ఉన్నతాధికారులు) జరగ్గా.. తెరవెనుక మాత్రం కర్త, కర్మ, క్రియ.. కేటీఆర్, కేసీఆర్ అని గట్టిగానే టాక్ నడుస్తోంది. ఈ కేసులో కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారన్నది గత నెల రోజులుగా జరుగుతున్న టాక్.

చర్లపల్లి జైలుకే..!

ఇన్ని రోజులూ కేసీఆర్‌ గురించి మాట్లాడకుండా మర్యాదపూర్వకంగానే ఉన్న రేవంత్.. ఒక్కసారిగా తుక్కుగూడ జనజాతర వేదికగా జూలు విదిల్చారు. కేసీఆర్.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నవేమో.. సమస్యేలేదని తానేం జానారెడ్డిని కాదని.. రేవంత్ రెడ్డిని అనే విషయం మర్చిపోకండి బిడ్డా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆనాడు చెబుతున్నా.. ఈనాడు చెబుతున్నా పేదలకు ఎక్కడా కేసీఆర్.. డబుల్ బెడ్రూమ్ కట్టివ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు చర్లపల్లిలో జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో చర్లపల్లి జైలులో కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వని కేసీఆర్‌కు..  తప్పకుండా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని హెచ్చరించారు. బిడ్డ, కొడుకు, అల్లుడు, నువ్వూ.. అందరూ కలిసి ఉండేలా ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోనని కేసీఆర్‌కు రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. చూశారుగా.. రోజురోజుకూ తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. కేసీఆర్‌ అరెస్ట్ అయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.. అయినా రేవంత్ రివెంజ్ తీర్చుకోకుండా ఎందుకుంటారు..?. ఏం జరుగుతుందో చూద్దాం మరి.

Revanth Reddy vs KCR :

Revanth revenge on KCR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs