Advertisement
Google Ads BL

షాకిచ్చే స్థాయిలో సాయి పల్లవి రెమ్యునరేషన్


సాయి పల్లవి కుర్రకారుని ఫిదా చెయ్యడంతో పాటు సామాన్యమైన ఆడపిల్లలకి కూడా వారి భవిష్యత్ పై అసామాన్యమైన నమ్మకాన్ని కలిగించే రోల్ మోడల్ గా ఎదిగిన హీరోయిన్. డాన్స్ షోస్ లో తన ప్రతిభని చూపించుకుంటూ సినిమా రంగంలోకి ఎంటర్ అయిన.. సాయి పల్లవి తొలిచిత్రం ప్రేమంతోనే అనూహ్య విజయాన్ని చవిచూసేసింది. ఆపై ఆమెకు అవకాశాలు పోటెత్తి వచ్చినా తాను మాత్రం తనకి నచ్చిన, తనకి తగ్గ పాత్రలని, కథలని మాత్రమే ఎంచుకుంటూ ప్రయాణిస్తుంది. 

Advertisement
CJ Advs

బేసిక్ గా తాను మంచి డాన్సర్ అయినప్పటికీ స్టార్ హీరోల పక్కన పొట్టి బట్టలేసుకుని గంతులేసే పాత్రలకి సాయి పల్లవి దూరం కనకే ఆమెకి కూడా చెప్పుకోవడానికి కమర్షియల్ హిట్స్ దూరమైపోతున్నాయి. అయినప్పటికీ తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వస్తున్న సాయి పల్లవి ఆమె ఐడియాలజీకి తగ్గ ఆఫర్స్ నే అందుకుంటుంది. ప్రస్తుతం తనకి బాగా నచ్చిన కథ అంటూ నాగ చైతన్య తో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవిని మోస్ట్ ప్రస్టేజియస్ రామాయణంలో సీత పాత్ర వరించింది. 

బ్రహ్మాస్త్ర, యానిమల్ వంటి గన్ షాట్ హిట్స్ తో ఓ రేంజ్ రేజ్ లో ఉన్నరణబీర్ కపూర్ రాముడిగా రామాయణ కావ్యాన్ని తెరపైకి తెస్తోన్న టాప్ మేకర్స్ సీత పాత్రలో సాయి పల్లవిని చూసారు. అడిగారు. అభ్యర్ధించారు. ఆమెకి ఆల్మోస్ట్ మూడు రెట్ల అధిక మొత్తం రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసారు. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషనల్ న్యూస్. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్.  

అత్యంత ప్రతిష్ట్మాకంగా తెరకెక్కనున్న రామాయణంలో సీత పాత్ర కోసం దాదాపు పది కోట్ల రెమ్యునరేషన్ ని సాయి పల్లవి అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు సౌత్ లోను అటు నార్త్ లోను ఇప్పుడున్న ఏ క్రేజీ హీరోయిన్ తో పోల్చినా సాయి పల్లవి స్థాయి తగ్గేదేలే అనే రేంజ్ కి అకస్మాత్తుగా పెరిగిపోయింది. సహజమైన అందం, స్వచ్ఛమైన నవ్వు, స్పష్టత చూపించే అభినయం, శరవేగంగా చేసే నృత్యాలు సాయి పల్లవి ప్రత్యేకతలు. అందుకే ఈ సారంగా దరియాకి ఎంతోమంది అయ్యారు అభిమానులు. పారితోషికం అందుకోవడమే కాదు ఆ పాత్రకు ప్రాణం పొయ్యడంలో కూడా సాయి పల్లవి ప్రజ్ఞ సీత పాత్రలో కనిపిస్తుందని ఆశిద్దాం, ఖచ్చితంగా ఉండాలని కోరుకుందాం. 

Sai Pallavi remuneration for Ramayan:

Ramayan: Sai Pallavi Remuneration Touching Stars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs