Advertisement
Google Ads BL

షాక్: రామాయణం నుంచి ఫొటోస్ లీక్


హిందీలో భారీ తారాగణంతో నితీష్ తివారి దర్శకత్వంలో రీసెంట్ గానే మొదలైన రామాయణ చిత్రం తెలుగు వెర్షన్ కి సంబంధించి మాటలు అందించే బాధ్యత టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి అప్పగించబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో.. రీసెంట్ గా షూటింగ్ మొదలైన రామాయణ షూటింగ్ స్పాట్ నుంచి ఫొటోస్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముంబైలోని గోరేగావ్ సిటీలో వేసిన రామాయణ సెట్స్ నుంచి వీడియోస్, ఫొటోస్ లీకవ్వడం కలకలం సృష్టించింది. 

Advertisement
CJ Advs

రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో, ప్రముఖ పాన్ ఇండియా స్టార్ యాష్ రావణ్ పాత్రలో, సూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విభీషనుడిగా విజయ్ సేతుపతి కనిపించబోతున్న రామాయణ చిత్రాన్ని నితీష్ తివారి మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఇన్ని భాషల నటులు నటిస్తున్న రామాయణ చిత్రాన్ని నితీష్ ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ మొదలైన కొద్ధి రోజుల్లోనే సెట్స్ నుంచి ఫొటోస్, వీడియోస్ లీకవడంపై దర్శకుడు చాలా ఆగ్రహంతో ఉన్నారట. 

ముందుగానే డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ఆయన సెట్స్ లో చాలా కండిషన్స్ పెడుతున్నారట.సెట్స్ లోకి నటులు కానీ, టెక్నీకల్ సిబ్బంది కానీ ఫోన్స్ పట్టుకురాకూడదనే కండిషన్ ని ముందుగా అప్లై చేశారట. ఇప్పటికే లీకైన ఫోటోస్ లో కైకేయిగా లారా దత్త , దశరధ్ గా అరుణ్ గోయల్ కనిపించారు. అందుకే నితీష్ తివారి చాలా సీరియస్ గా షూటింగ్ జరిగే సమయంలో నటులు, అందుకు కావల్సిన టెక్నీకల్ టీమ్ మాత్రమే అక్కడ ఉండి.. మిగతా వారు షూటింగ్ కి దూరంగా ఉండాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. 

Ramayana: Shooting Pics Leaked, First Looks Unnecessary?:

Lara Dutta, Arun Govil photos from Ramayana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs