Advertisement
Google Ads BL

రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు సాహసం


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తియ్యడం అంటే అల్లా టప్పా విషయం కాదు, ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆ రేంజ్ మూవీస్ మాత్రమే రామ్ చరణ్ ఒప్పుకుంటున్నాడు. కాకపోతే ఉప్పెన తర్వాత రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా ని అనౌన్స్ చేసి పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసిన బుచ్చి బాబు.. రామ్ చరణ్ తో ఎలాంటి మూవీ చెయ్యబోతున్నాడో.. ముహూర్తానికి ముందే ఇచ్చిన అప్ డేట్స్ తో మెగా ఫాన్స్ కూల్ మెత్తబడ్డారు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం కోసం ఏ ఆర్ రెహ్మాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకురావడం, హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని సెట్ చెయ్యడం, ఇప్పుడు చరణ్ తాతయ్య పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ని ఒప్పించేందుకు బుచ్చిబాబు చేసే ప్రయత్నాలు చూస్తుంటే రామ్ చరణ్ తో మూవీ కోసం బుచ్చిబాబు హైఫై ఆలోచనలు గురించి సుకుమార్ ఎందుకు చెప్పారో అనేది ఇప్పుడు అర్ధమవుతుంది. అమితాబ్ ని తాత పాత్ర కోసం ఒప్పించడం నిజంగా సాహసమే. 

అమితాబ్ సౌత్ లో అందులోను తెలుగులో ఆయనకి నచ్చిన పాత్రలు ఒప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులని కనువిందు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కల్కి 2898 లో ఆయన కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని కూడా ఈ మూవీలో భాగం చేస్తున్నాడట బుచ్చిబాబు. దీన్ని చూస్తుంటే RC16 కోసం బుచ్చి బాబు ప్లాన్స్ మాములుగా లేవు అంటే... అవును రామ్ చరణ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా అంటున్నారు మెగాభిమానులు. 

Buchi Babu meets Amitabh for RC16?:

 Amitabh Bachchan to play Key Role In RC16
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs