Advertisement
Google Ads BL

వైభవంగా అమలా పాల్ శ్రీమంతం


కోలీవుడ్ నటి అమల పాల్ గత ఏడాది బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ని ప్రేమించడం, నిశ్చితార్ధం చేసుకోవడం.. ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. గతంలో తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న అమలా పాల్ అత్తగారింట్లో ఇమడలేక, భర్త తో పొసగక విజయ్ తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత విజయ్ రెండో పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

అమల పాల్ గత ఏడాది వరకు సింగిల్ గానే కనిపించినా.. గత ఏడాది జగత్ దేశాయ్ తో ప్రేమని బయటపెట్టి ట్విస్ట్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత వెంటనే తాను ప్రెగ్నెంట్ అంటూ బేబీ బంప్ ఫొటోస్ ని షేర్ చేసిన అమలా పాల్ తాజాగా శ్రీమంతం వేడుకని ఘనంగా చేసుకుంది. భర్త జగత్ దేశాయ్ అమలా పాల్ శ్రీమంతాన్ని వైభవంగా నిర్వహించాడు. 

జగత్ దేశాయ్ గుజరాత్ లోని సూరత్ లో అమల పాల్ శ్రీమంతం వేడుకని నిర్వహించాడు. ఈ శ్రీమంతానికి సంబందించిన ఫొటోస్ ని అమలా పాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ప్రేమానురాగాలతో కూడిన సాంప్రదాయమైన శ్రీమంతం వేడుక అంటూ క్యాప్షన్ పెట్టింది. 

Magnificently Amala Paul Seemantham:

Actress Amala Paul baby shower photos 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs