Advertisement
Google Ads BL

ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ టాక్


విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. విజయ్‌తో ఇంతకు ముందు గీతగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. గత వారం, పది రోజులుగా ఎక్కడ విన్నా ఫ్యామిలీ స్టార్ అనే మాటే వినబడేలా.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులలోకి యూనిట్ తీసుకెళ్లే ప్రయత్నాలు చేసింది. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక లైగర్ అట్టర్ ఫ్లాప్ అనంతరం చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై విజయ్ దేవరకొండకే కాకుండా ఆయన అభిమానుల్లో సైతం టెన్షన్ నెలకొంది. ఎందుకంటే, విజయ్ టాప్ రేస్‌లో నిలబడాలంటే ఈ సినిమా ఎంతో కీలకం. అందుకే.. సినిమా టాక్ ఏంటా అని.. అంతా సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పటికే చాలా చోట్ల షోస్ పడ్డాయి. యుఎస్ ప్రీమియర్స్ కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాను చూసిన వారంతా.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. పక్కా ఫ్యామిలీ బొమ్మ ఇది అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా ప్రియుడిగా చూస్తే ఈ సినిమా బాగా నచ్చుతుందని.. లేదంటే రొటీన్ బొమ్మే అనేలా కొందరు పోస్ట్ చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే.. 

ఇది ఫ్యామిలీ బొమ్మ.. మాస్ అండ్ కమర్షియల్ మైండ్ సెట్‌తో థియేటర్‌కి వెళ్లకుండా ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్, ఫ్యామిలీస్‌తో వెళ్లండి.. ఎంజాయ్ చేయండి. విజయ్ దేవరకొండ, మృణాల్ అద్భుతంగా నటించారు. డౌట్ లేకుండా బ్రేకీవెన్ అవుతుంది అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

ఫ్యామిలీ స్టార్ రివ్యూ.. అంటూ సినిమాలో పాజిటివ్స్ మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్లు, ప్రొడక్షన్ వేల్యూస్.. నెగిటివ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ప్లేస్‌మెంట్, ఊహించగలిగే స్క్రీన్‌ప్లే, అవసరం లేని అలాగే రిపీటెడ్ సీన్స్, ఆసక్తికరంగా లేని ఫైటింగ్ సీక్వెన్స్.. అంటూ ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్టాఫ్ మాత్రం డీసెంట్‌గా ఉందంటూ ఎక్కువగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి మిక్స్‌డ్ రెస్పాన్స్ మధ్య.. అసలీ సినిమా భవితవ్యం ఏమిటనేది తెలియాలంటే కాసేపట్లో వచ్చే రివ్యూ వరకు వెయిట్ చేయకతప్పదు.

Family Star Premiers talk:

Family Star Overseas Premiers talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs