Advertisement
Google Ads BL

టెన్షన్‌లో విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ‌కి లైగర్ ముందు ఉన్న యాటిట్యూడ్ కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా.. ఇప్పుడు చాలావరకు విజయ్ దేవరకొండ‌లో మార్పొచ్చింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ తర్వాత అతనిలోని మాస్ యాంగిల్ కానీ, యాటిట్యూడ్ కానీ కనిపించడం లేదు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. ప్రమోషన్స్ లోనూ, అతను ఎంచుకున్న కథల్లోనూ ఏదైనా కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

ఒకప్పుడు విజయ్ దేవరకొండని చూసి యూత్ క్రేజీగా ఫీలయ్యేవారు, అతని డ్రెస్సింగ్ స్టయిల్, అలాగే యాటిట్యూడ్‌ని కాపి కొట్టేందుకు ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండని చూడగానే.. అయ్యో పాపం మనోడికి ఓ మాస్ హిట్ పడితే బావుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కూడా తగ్గే ఉన్నాడు. లైగర్ డిజాస్టర్ ఛాయల నుంచి, లైగర్ అప్పుడు ఈడీ పిలిపించడం ఇవన్నీ అతని కెరీర్‌ని డ్యామేజ్ చేసేవే. అందుకే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ హిట్ కోసం చాలా కష్టపడ్డాడు 

పలు టీవీ ఛానల్స్‌లో ఉగాది సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు ఇలా ప్రతి తెలుగింటి ఛానల్స్‌లో ఉగాది పండుగ సెలెబ్రేషన్స్‌లో మృణాల్ ఠాకూర్, దిల్ రాజులతో సహా పాల్గొన్నాడు అంటేనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విషయంలో ఎంత టెన్షన్‌గా ఉన్నాడో అర్ధమవుతుంది. 

మరి కాసేపట్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ వచ్చేస్తుంది. విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ సక్సెస్‌ని అందించిందా? లేదా అనేది తేలిపోతుంది కాబట్టి.. విజయ్ టెన్షన్‌కు కాసేపట్లో బ్రేక్ పడనుందని భావించవచ్చు. 

Family Star Vijay Deverakonda in Tension:

Vijay Deverakonda Waiting for Family Star Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs