హిందీలో హీరోయిన్‌గా గుర్తింపు లేక సౌత్‌లో వచ్చిన అవకాశాలు చక్కగా వాడుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమెకి హను రాఘవపూడి పిలిచి సీతా రామంలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ చిత్రంలో మృణాల్ ఠాకూర్ లుక్స్‌కి, ఆమె పెర్ఫార్మెన్స్‌కి ఫిదా అవ్వని సౌత్ ప్రేక్షకులు లేరు. ఆఖరికి ఆమెని వద్దనుకున్న హిందీ ప్రేక్షకులు కూడా సీతారామం హిందీ వెర్షన్‌ని బాగా ఆదరించారు. సీతారామంతో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంది మృణాల్.
ఆ తర్వాత హీరో నాని హాయ్ నాన్నలో అవకాశం ఇచ్చాడు. హాయ్ నాన్నలో కూడా క్యూట్‌గా స్వీట్‌గా ప్రేక్షకులకి దగ్గరైంది. ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఈ శుక్రవారం విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ లోనూ మృణాల్ లుక్స్ పరంగా సూపర్బ్‌గా కనిపించడమే కాదు, హీరో విజయ్ దేవరకొండ సరసన పర్ఫెక్ట్ జోడిగా కనిపిస్తుంది.
విజయ్ దేవరకొండతో కలిసి సినిమా ప్రమోషన్స్‌లో డాన్స్, ఆమె గ్లామర్, అలాగే ఫ్యామిలీ స్టార్‌పై టీమ్ కాన్ఫిడెన్స్ అన్నీ చూస్తుంటే.. ఈ చిత్రం కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. ఫ్యామిలీ స్టార్ పై మార్కెట్ లోనూ మంచి బజ్ ఉంది. మరి మృణాల్ నమ్మకాన్ని ఫ్యామిలీ స్టార్ నిలబెడుతుందా.. హ్యాట్రిక్ హిట్ ఆమె చెంతకు చేరుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.