Advertisement
Google Ads BL

కమెడియన్ యాదమ్మ రాజు అరెస్ట్ డ్రామా


యూట్యూబర్ కమ్ కమెడీయన్ యాదమ్మ రాజు అరెస్ట్.. ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన వార్త. పలు టీవీ ఛానల్స్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మరాజు ప్రస్తుతము ఈటీవి జబర్దస్త్ కామెడీ షోలో ఎంటర్టైన్ చేస్తున్నాడు. యాదమ్మ రాజు భార్య స్టెల్లా తో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేసే యాదమ్మరాజు అరెస్ట్ అవడంపై పలువురు పలురకాలుగా మాట్లాడుతున్నారు. 

Advertisement
CJ Advs

యాదమ్మ రాజును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు పంపించారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అసలు కామెడీ చేసుకునే యాదమ్మ రాజును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు. యాదమ్మరాజు చేసిన చేసిన తప్పేంటి అని అందరూ ఆరాలు మొదలుపెట్టారు. 

యాదమ్మరాజు తన యూట్యూబ్ ఛానల్లో.. నన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు పట్టుకొనిపోయారు. ఏప్రిల్ 1న ఒక సంఘటన జరగడంతో వల్ల నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి దానికి సంబందించిన వార్తలు వచ్చాయి. అసలు పోలీసులు నన్నెందుకు అరెస్ట్ చేశారో..  ఏం జరిగిందో.. తెలియాలంటే కింద లింక్ క్లిక్ చేస్తే అర్థం అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు. 

అయితే యాదమ్మరాజు చేసింది ఏప్రిల్ ఫూల్ అని, అతనేదో వెబ్ సీరీస్ లో నటించి దాని ప్రమోషన్ కోసమే ఇలా చేసాడు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివి చెయ్యడం యూట్యూబర్స్ కి అలవాటే.. ఎవ్వరూ యాదమ్మరాజు అరెస్ట్ గురించి దిగులు చెందొద్దు అటూ చెబుతున్నారు. 

Comedian Yadamma Raju Arrest Drama:

Comedian Yadamma Raju Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs