Advertisement
Google Ads BL

షూటింగ్ లో అజిత్ కి ప్రమాదం


యాక్షన్ సీక్వెన్సెస్ లో డూప్ లేకుండా చేసే హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. అంతేకాకుండా బైక్ రైడింగ్, కార్ రేస్ లు అంటూ ఎవ్వరో కానీ ట్రై చెయ్యరు. కానీ కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ మాత్రం సినిమాల్లోనే కాదు ఆయన నిజ జీవితంలోను బైక్ రైడ్స్, కార్ రేస్ లు అంటూ సాహసాలు చేస్తూ ఉంటారు. అజిత్ బైక్స్ తోనే ఎంతో రిస్కీ సీన్స్ ని తన కెరీర్ లో చేసారు. ప్రొఫిషనల్ గా రేసర్ కావడంతో ఆయన కెరీర్ లో ఎన్నో రిస్క్ లు చేయడం వాటిలో గాయాలు పాలు కావడం కూడా కామన్ గా జరిగేదే. 

Advertisement
CJ Advs

తాజాగా అజిత్ మరో ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం అజిత్ కుమార్ దర్శకుడు మాగిజ్ తిరుమనేని దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ విడాముయార్చి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అజిత్ మేనేజర్ ఓ షాకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. విడాముయార్చి కి సంబంధించి గత ఏడాది నవంబర్ లో జరిగిన ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ వీడియో ఇది. ఈ వీడియో లో  అజిత్ కార్ నడుపుతూ ఓ ఇంటెన్స్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు.

అందులో భాగంగా కారు రోడ్ పై అదుపు తప్పి పడిపోయింది. ఆ వెంటనే చిత్ర బృందం కారు వద్దకి పరిగెత్తుకుని వెళ్ళి అజిత్ సహా మరో నటుడిని కారు నుంచి బయటకి తీసే ప్రయత్నం చేశారు. ఆ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం అజిత్ చాలా రిస్క్ తీసుకుంటారని ఆ వీడియో చూస్తే అర్ధమవుతుంది. మరి అజిత్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని మాత్రం అర్ధమవుతుంది. 

Ajith enacts dangerous stunts for Vidaa Muyarchi:

Ajith Kumar accident video from VidaaMuyarchi shooting in Azerbaijan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs