Advertisement
Google Ads BL

తీవ్ర జ్వరంతో సఫర్ అవుతున్న పవన్


గత శనివారం నుంచి పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆదివారం ఆయన పిఠాపురం పర్యటన తర్వాత కొన్ని టెస్ట్ ల కోసం హైదరాబాద్ చేరుకుని.. అవి పూర్తి కాగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళిపోయి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. ఏపీ ఎలక్షన్స్ లో జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు పొత్తులో పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ పిఠాపురం లో MLA గా పోటీ చేస్తూ ముందుగా అక్కడి నుంచే ఆయన ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం వేసవి వేడి విపరీతంగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ కి జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెట్టడంతో ఆయన ఈరోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమం వాయిదా పడింది. 

Advertisement
CJ Advs

జనసేన సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హెల్త్ పై ఓ ట్వీట్ వేసారు. 

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. 

పవన్ కళ్యాణ్ కోలుకోగానే.. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. పవన్ ఆరోగ్యం పై ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ ట్వీట్ చేసారు. 

Pawan suffering from high fever:

Pawan suffering with fever and postponed Tenali Visit PVCH
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs