Advertisement
Google Ads BL

పుట్టింటిలో నా ఆఖరి వ్రతం: ప్రియాంక జైన్


స్టార్ మా సీరియల్స్ లో కథానాయకి పాత్రలో కనిపించిన ప్రియాంక జైన్.. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 లో బాగా హైలెట్ అయ్యింది. అబ్బాయిలతో సమానంగా పోరాడడమే కాదు.. ఆమె హెయిర్ ని కూడా త్యాగం చేసింది. ఆమె టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. అమర్ దీప్, శోభా శెట్టితో స్నేహం, గౌతమ్ తో బ్రదర్-సిస్టర్ బంధాన్ని మైంటైన్ చేసిన ప్రియాంక శివాజీ కి ఎక్కువగా టార్గెట్ అయ్యింది. భోలే తో గొడవ, శివాజీ ఆమెని ప్రతిసారి విమర్శించడం ఇవన్నీ ప్రియాంక కి హెల్ప్ అయ్యాయి. బిగ్ బాస్ లో ఉండగానే ఆమె ప్రియుడు శివని అందరికి పరిచయం చేసింది. 

Advertisement
CJ Advs

శివ తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పింది. శివ-ప్రియాంక జైన్ లు ఓ సీరియల్ కలిసి నటించారు. అప్పుడే వారి మధ్యన ప్రేమ వికసించింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక ప్రియాంక-శివ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా పెళ్లి విషయం మాత్రం ఎత్తకుండా జాలిగా ట్రిప్స్ వేశారు. మధ్యలో ప్రియాంక తల్లి హాస్పిటల్ పాలవడం, ఇంకా ఆమె ఇతర ప్రోగ్రామ్స్ లో బిజీగా మారింది. 

అయితే శివ తాను పెళ్లి చేసుకోవడానికి ఆర్ధికంగా తమ దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పే ప్రియాంక జైన్ ఇప్పుడు పెళ్ళికి సిద్దమైనట్లుగా తెలుస్తోంది. 

రీసెంట్ గా ప్రియాంక జైన్ తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఆ పూజ వీడియో ని ఇన్స్టా లో షేర్ చేస్తూ ఇది పుట్టింటిలో నా ఆఖరి వ్రతం అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ చూసాక ఇకపై ప్రియాంక శివని వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుందేమో.. అందుకే పుట్టింటిలో ఆఖరి వ్రతం అని చెబుతుందేమో అంటున్నారు. ప్రియాంక కూడా పెళ్లి సిద్దమే అని చెప్పకనే చెప్పింది అంటూ ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. 

Priyanka Jain Gets Emotional And Says That This is Her Last Vratham :

Priyanka Jain Gets Emotional And Says That This is Her Last Vratham in Her Mothers House
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs