అల్లు అర్జున్ వారం రోజుల క్రితం భార్య, పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూనే మధ్యలో దుబాయ్ మేడం టుస్సాడ్స్ లో తన మైనపు విగ్రహావిష్కరణలో ప్రత్యేక అతిథిగా పాల్గొని తన మైనపు బొమ్మ పక్కన ఫొటోలకి ఫోజులిచ్చారు. ఫ్యామిలీతో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ పిల్లల వేసవి సెలవలని దుబాయ్ లో గడిపేసి వచ్చారు.
ఇక దుబాయ్ లో వారం రోజుల పాటు ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ నేడు బుధవారం హైదెరాబాద్ కి చేరుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బన్నీ తన భార్య స్నేహ, పిల్లలు ఆయన్, అర్హలతో కలిసి వస్తున్న వీడియోస్ వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే. ఆయన బర్త్ డే కి సుకుమార్ పుష్ప ద రూల్ నుంచి స్పెషల్ ట్రీట్ ని సిద్ధం చెయ్యడమే కాదు.. ఏప్రిల్ 8 న టీజర్ విడుదల అంటూ అప్ డేట్ ఇచ్చి అల్లు అభిమానులని సంతోషపెట్టారు. పుష్ప ద రూల్ నుంచి టీజర్ రాబోతుంది. అంతేకాకుండా ఆగష్టు 15 నుంచి తగ్గేదెలా అని మరోసారి మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చారు.
దీనితో పాటుగా అల్లు అర్జున్-అట్లీ-అనిరుద్ రవిచంద్రన్ కాంబో మూవీకి సంబంధించి కూడా అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.