ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎక్కడా చూసినా ఈ హీరో విజయ్ దేవరకొండనే కనిపిస్తున్నాడు. రేపు శుక్రవారం విడుదల కాబోయే ఫ్యామి స్టార్ ని తెగ పబ్లిసిటీ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. అసలే లైగర్ డిసాస్టర్ విషయంలో ఎంత మధనపడుతున్నాడో అనేది అతని మాటల్లో స్పష్టమవుతుంది. లైగర్ తర్వాత మూడు సినిమాల వరకు మట్లాడకుండా మూసుకుని కూర్చోవాలని డిసైడ్ అయ్యి తనకి తానే శిక్ష వేసుకున్నాను అంటూ చెబుతున్న విజయ్ దేవరకొండ ఎటు చూసినా ఫ్యామిలీ స్టార్ లా అంటే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తున్నాడు.
అయితే ఫ్యామిలీ స్టార్ హిట్ తనకెంతో అవసరం అన్నట్టుగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో కలిసి ఎక్కడ స్టేజ్ షేర్ చేసుకున్నా డాన్స్ చెయ్యకుండా మాత్రం ఉండడంలేదు. హోలీ రోజున మృణాల్ ఠాకూర్ తో కలిసి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డాన్స్ తో దుమ్మురేపిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ స్టార్ మీడియా మీట్ లో మృణాల్ తో కలిసి మరోసారి అదిరిపోయే స్టెప్స్ వేసాడు.
అంతేకాదు నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను విజయ్ దేవరకొండ మృణాల్ తో కలిసి మరోసారి కాలు కదిపి అలరించాడు. అలాగే ఇన్స్టా లో ఫేమస్ అయిన వారితో ముచ్చట్లు పెట్టడం చూసిన ప్రేక్షకులు విజయ్ దేవరకొండ దేన్నీ వదలట్లేదు.. ఫ్యామిలీ స్టార్ తో పక్కా హిట్ కొడతాడులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.