యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నాడు. కొరటాల శివ తో దేవర ని మే ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత కొరటాల పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా పబ్లిసిటీ పనులు చూసుకుంటే.. ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్ మూవీ వార్ 2 కోసం ప్రిపేర్ అవుతారని తెలుస్తోంది. హృతిక్ రోషన్ తో ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చెయ్యబోయే వార్ 2 షూటింగ్ మార్చ్ లోనే పట్టాలెక్కింది.
హృతిక్ రోషన్ ఇప్పటికే తన పాత్ర తాలూకు సన్నివేశాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరిగినా.. ఇప్పుడు మాత్రం హృతిక్ రోషన్ కి సమానమైన ఇండియన్ రా ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడట. రా ఏజెంట్ గా ఎన్టీఆర్ పర్ఫెక్ట్ లుక్ కోసం వార్ 2 మేకర్స్ యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఎన్టీఆర్ కోసం ఓ స్పెషల్ ట్రైనర్ ని పంపించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ట్రైనర్ ని ఎన్టీఆర్ ని తన పాత్రకోసం పూర్తిగా సిద్ధం చేసేందుకు పంపించబోతున్నారట. రెండు వారాల పాటు ఎన్టీఆర్ కి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందట. రా ఏజెంట్ గా ఎన్టీఆర్ ఎవ్వరూ ఊహించని లుక్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ట్రైనర్ మేటర్ తో ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం తెగ ఎగ్జైట్ అవుతున్నారు.