సామజవరగమన సూపర్ హిట్ తర్వాత శ్రీ విష్ణు మార్కెట్ పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత తన పాత మిత్రులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో కలిసి ఓం భీమ్ బుష్ అంటూ కామెడీ చిత్రం చేసాడు. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని నిర్మాతలకి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే 25 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి ఇంకా థియేటర్స్ లాభాల దిశగా ప్రయాణం సాగిస్తోంది.
థియేటర్స్ హిట్ అయిన ఈ చిత్రం ఎప్పుడెప్పడు ఓటీటీలోకి వస్తుందా అని శ్రీవిష్ణు అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఓం భీమ్ బుష్ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌కు పోటీ ఏర్పడింది. తీవ్ర పోటీ నడుమ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓం భీమ్ బుష్ ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేసింది. ఈ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లుగా ప్రచారం జరిగింది.
ముందుగా ఓం భీమ్ బుష్ సినిమా థియేటర్లలోకి వచ్చిన 4 వారాల తర్వాతనే స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. థియేటర్స్ లో హిట్ టాక్ తో రన్ అవుతూ ఉండడంతో ఆ డేట్ ని మార్చే అవకాశం ఉంది అన్నారు. అది ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ అవ్వొచ్చని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ సంస్థ స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతుందట. దీనిపై త్వరలోనే అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.