Advertisement

రివర్స్ డ్రామా..


ఏపీలో పెన్షన్ డ్రామా ఇప్పుడు మీడియాలో తెగ హైలెట్ అవడమే కాదు.. వైసీపీ vs టీడీపీ అన్నట్టుగా తయారైంది. జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని స్థాపించి వారి చేత ప్రతి ఇంతికి పెన్షన్ అందించే కార్యక్రమం చేపట్టింది. అయితే అది నిన్నటివరకు దిగ్విజయంగానే సాగింది. మధ్యలో టీడీపీ, జనసేన నేతలు వాలంటీర్ల చేత వైసీపీ ప్రతి ఇంటికి ప్రచారం చేసుకుంటూ వాళ్ళని భయపెడుతూ ఓట్లు వేయించే ప్లాన్ చేసింది అంటూ హడావిడి చేసారు. 

Advertisement

తాజాగా ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో ఎలక్షన్ కమిషన్ ఈ వాలంటీర్లని ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వొద్దు అంటూ స్టే తేవడంతో అసలు రగడ మొదలైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కోర్టుకి వెళ్లి ఈ పెన్షన్ ని పంపిణి చెయ్యకుండా ఆపించాడంటూ వైసీపీ నేతలు, సజ్జల, పేర్ని నాని లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వృద్దులు ఎండలో సచివాలయం దగ్గరకి వెళ్లి పెన్షన్ తెచ్చుకోవడం చాలా బాధాకరం, వారి బాధకి కారణం చంద్రబాబే అంటూ మీడియాలో గోల గోల చేస్తున్నారు.  

అయితే ఇప్పడు అక్కడ రివర్స్ డ్రామా మొదలైంది, అదేనండి టీడీపీ మొదలు పెట్టింది. మొదటి తారీఖున ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ఇచ్చే వాలంటీర్లు కోసం పెద్దవాళ్ళ ఎదురు చూపులు ఫలించలేదు, వాళ్ళు ఈ వయసులో సచివాలయం క్యూలో నిలబడి పెన్షన్ తెచ్చుకోవడం కష్టం అంటూ టీడీపీ నేతలు నేరుగా సీఎస్ జవహార్ రెడ్డిని కలిశారు. పెన్షన్ పంపిణీపై ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెన్షన్ అందకుండా జాప్యం చేస్తుంది. సకాలంలో పేదలకి పెన్షన్ అందేలా చూడాలని కోరారు. పెన్షన్లు కావాలనే జాప్యం చేస్తున్నారని వర్ల రామయ్య  ఆరోపించారు. అంతేకాకుండా గతంలో మాదిరి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ నెల 5 లోగా పంపిణీ పూర్తి చేయాలని తాము ఈసీ ని కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తిని సీఎస్ జవహార్ సానుకూలంగా స్పందించారని అన్నారు. 

TDP Reverse drama..:

YCP vs TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement