పూజ హెగ్డే కి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా ఈ మధ్య వరకు ఎక్కడా వినిపించలేదు, గతంలో సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే డేటింగ్ లో ఉంది అనే వార్తలొచ్చినా అవి జస్ట్ రూమర్స్ అని తేలిపోయాయి. అయితే గత ఏడాది నుంచి పూజ హెగ్డే ఓ క్రికెటర్ తో లవ్ లో ఉంది అనే వార్తలు వినిపించాయి. మరోపక్క బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజ హెగ్డే చట్టపట్టాలేసుకుని తిరుగుతుంది అనే ప్రచారం షురూ అవడమే కాదు.. వీరిద్దరూ పార్టీలు, వెకేషన్స్ అంటూ తిరుగుతున్నారనే ప్రచారం కూడా మొదలైంది.
అయితే సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉన్న పూజ అనే వార్త చూసినప్పుడు.. నేనొక సెలెబ్రిటీని, నాపై రోజుకో వార్త పుడుతుంది. వాటిని చదివి నవ్వుకుంటాను, నేను ఎవ్వరితో డేటింగ్ లో లేను, నేనింకా సింగిల్ నే అంటూ స్పష్టం చేసిన పూజ హెగ్డే ఇప్పుడు రోహన్ మెహ్రా విషయం పై స్పందించడం లేదు. అయితే రోహన్ మెహ్రా ఇంకా నటుడిగా పెద్దగా ఫేమస్ పర్సన్ కాదు. అలాంటి వ్యక్తితో పూజ హెగ్డే రిలేషన్ లో ఉండే ఛాన్స్ లేదు అని అభిమానులు వాదిస్తున్నారు.
కానీ పూజ హెగ్డే మాత్రం రోహన్ మెహ్రా తో ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఈమధ్యన పూజ హెగ్డే రోహన్ మెహ్రా తో కలిసి పార్టీలకి, రెస్టారెంట్స్ కి తరచూ వెళుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరి ఈ వార్తలు, ఈ వీడియోపై పూజ హెగ్డే స్పందన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తితో ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.