పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా వున్నారు. ఆయన పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నారని ప్రకటించగానే జనసేన కార్యకర్తలు, పవన్ ఫాన్స్ ఆయనకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అక్కడ టీడీపీ ఇంచార్జ్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం మొదలు పెట్టారు. గత శనివారం నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. ముందుగా వర్మ ఇంటికి వెళ్లి ఆయన్ని సత్కరించి, వర్మ తల్లిగారి ఆశీస్సులు తీసుకుని పవన్ ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కి కొద్దిగా ఫీవర్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన జ్వరంతోనే శనివారం ప్రచారం ప్రారంభించినట్లుగా, అలాగే పవన్ కల్యాణ్ ఆదివారం శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.. అయితే పవన్ కళ్యాణ్ కి ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి నిరసించిపోవడంతో జ్వరం మళ్లీ తిరగబెట్టినట్లుగా తెలుస్తోంది.
దానితో పవన్ వెంటనే హైదరాబాద్ వచ్చి ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు అని సమాచారం. పవన్ త్వరగా కోలుకుని మళ్ళీ ప్రచారాన్ని కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పవన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై వస్తున్న వార్తలు వలన ఎవరూ కంగారు పడవద్దని, విపరీతమైన ఎండలో తిరిగినందువలనే పవన్ కి నీరసం వచ్చినట్లుగా, పూర్తిగా కోలుకున్నాకే ఆయన మరలా పర్యటనని మొదలు పెడతారని జనసేన నేతలు చెబుతున్నారు.