రష్మిక మందన్న ప్రస్తుతం క్షణం తీరిక లేని హీరోయిన్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా తయారైంది ఈ నేషనల్ క్రష్. హిందీలో యానిమల్ హిట్ తర్వాత అక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళింది. పుష్ప పాన్ ఇండియా ఫిలిం, ధనుష్ తో కుబేర పాన్ ఇండియా ఫిలిమ్స్ లో నటిస్తున్న రష్మిక ఈ మధ్యనే జపాన్ వెళ్ళొచ్చింది. అక్కడ అభిమానులు రశ్మికకి అపూర్వ స్వాగతం పలికారు.
ప్రస్తుతం వరస సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్న రష్మిక వీకెండ్ లో ఏం చేస్తుందో అనేది రివీల్ చేసింది. చాలామంది హీరోయిన్స్ ఖాళీ సమయాల్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. కానీ రష్మిక మాత్రం కుటుంబంతో కొద్దిసేపు గడిపినా ఎక్కువ సమయాన్ని మాత్రం తన స్నేహతులతో గడపడానికే ఎక్కువ ఇష్టపడుతుందట. అందుకే వీకెండ్స్ లో చిన్న ఖాళీ వచ్చినా రష్మిక ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడిపేస్తాను అని చెబుతోంది.
ఇక రష్మిక ఈ మధ్యనే లేడీస్ ప్రోబ్లెంస్ అయిన పీరియడ్స్ గురించి, దాని మూడ్ స్వింగ్స్ గురించి సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అయ్యింది. ఆరోగ్య విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది రష్మిక.