హనుమాన్ అంటూ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రానికి పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ కి 30 కోట్లు పైనే కలెక్షన్స్ వచ్చాయి. జనవరి 12 న విడుదలైన ఈ చిత్ర పెద్ద స్టార్స్ తో పోటీ పడి అద్భుతమైన బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్ గా రాబోయే జై హనుమాన్ పై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. హనుమాన్ లో అంజనాద్రి అనే ఊరితో తేజ సజ్జని హీరోని చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్ లో ఏం చూపిస్తారో, ఏ హీరోని తీసుకోస్తారో అనే ఆత్రుత అందరిలో మొదలైపోయింది.
ఇప్పటికే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ స్క్రిప్ట్ తో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులని మొదలు పెట్టేసాడు. అయితే ఈ చిత్రం పై ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ ఆసక్తి రేకెత్తించింది. ఆల్రెడీ హను మాన్ లో ఒక కల్పిత గ్రామం అంజనాద్రి ని డిజైన్ చేసి చూపించిన ప్రశాంత్ వర్మ ఈసారి జై హనుమాన్ లో అంజనాద్రి 2.0 ని పరిచయం చేసాడు. ఓ చిన్న వీడియో లో అంజనాద్రి లో సముద్రం అందులోని కొండలతో కూడిన దృశ్యాలు చూపించాడు.
హనుమాన్ చిత్రంతోనే విజువల్ వండర్ ని అద్భుతంగా చూపించిన ప్రశాంత్ జై హనుమాన్ లో విజువల్స్ మరింత కొత్తగా మరింత గ్రాండ్ గా ఉండబోతున్నాయని ప్రామిస్ చేస్తున్నాడు. జై హనుమాన్ చిన్న చిన్న అప్ డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.