బాలీవుడ్ బ్యూటీ అయినా సౌత్ లో సూపర్ హిట్ సినిమాలతో సక్సెస్ అయిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ ఇంటర్వూస్ లో గ్లామర్ గా మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్ తన వ్యక్తిగత విషయాలపై చేసే కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. సెలబ్రిటీస్ అవడం వల్ల కొన్ని నష్టాలూ అలాగే లాభం కూడా ఉంటుంది అని చెప్పింది.
ఒక్కోసారి కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం దగ్గరలేకపోతే ఆ బాధ చెప్పనలవి కాదు, షూటింగ్స్ తో బిజీగా వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఫ్యామిలీని బాగా మిస్ అవుతూ ఉంటాము, నాకు ఒక్కోసారి సాధారణ జీవితం గడిపితే బావుంది అనిపిస్తుంది. 20 ల్లో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని కని వారితో నైట్ సరదాగా డిన్నర్ కి వెళ్లాలనిపిస్తూ ఉంటుంది.
సెలెబ్రిటీ అయినందువల్ల గుడికి కూడా ఫ్రీగా వెళ్లి దేవుడిని దర్శనం చేసుకోలేము. ఒక్కోసారి చావు నన్ను భయపెడుతుంది. నేను చచ్చిపోతే నా కుటుంభం ఏమైపోతుంది అనే ఆలోచనలు నన్ను భయపెడుతూ ఉంటాయి.. అంటూ మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ, మరణం అంటూ కొత్త కొత్త గా చెప్పుకొచ్చింది.