మహేష్ బాబు సమ్మర్ హాలిడేస్ ని తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏడాదికి రెండు మూడు వెకేషన్స్ కి వెళ్లే మహేష్ బాబు ఎక్కువగా అమెరికా, దుబాయ్, పారిస్, స్పెయిన్ లాంటి ప్రదేశాలకి వెళుతూ ఉంటారు. అందులో స్విట్జర్లాండ్ కూడా ఉంటుంది. అయితే మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం తర్వాత ఒకటి రెండు యాడ్ షూట్స్ లో పాల్గొని రాజమౌళి మూవీని పట్టాలెక్కించే ముందు తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్స్ కి వెళ్లిపోయారు. ఓ నెల పాటు ఆయన తన ఫ్యామిలీతో గడిపేందుకు ఈసారి స్విట్జర్లాండ్ వెళ్లారు.
ప్రస్తతం స్విట్జర్లాండ్ లో మహేష్ భార్య నమ్రత పిల్లలు సితార, గౌతమ్ లు మంచు కొండల్లో మంచుతో ఆడుకుంటున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ మంచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు గత నాలుగైదు రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు ఇన్స్ట్రాలో పోస్ట్ చేస్తుంది. దానితో హాట్ సమ్మర్ లో కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
స్విట్జర్లాండ్ లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో మహేష్ ఫ్యామిలీ అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సితార ఘట్టమనేని అయితే ఎంతో చిల్లింగ్ గా కనిపిస్తోంది. మంచు కొండల్లో మైనస్ డిగ్రీల చలిలో విహారయాత్ర సాహసమే అయినా కానీ, వారంతా ఈ చల్లని వాతావరణంలో ఎంతో ఆహ్లాదంగా ఆడుకుంటున్నారు. అయితే మహేష్ కూడా మంచులో కనిపించినా ఆయన మొహం మొత్తం మఫ్లర్ తో కప్పేసి, చేతులకి గ్లౌసెస్ వేసుకుని కనిపింఛారు.