మిల్కి బ్యూటీ తమన్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఎప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తుంటే, తమన్నా మాత్రం ఇంకా ఇంకా కెరీర్ లో బిజీ అయ్యేందుకు ఎదురు చూస్తుంది. హిందీలో అవకాశాలు రాగానే గ్లామర్ డోస్ మరింతగా పెంచేసిన తమన్నా కి ప్రస్తుతం సౌత్ ఆఫర్స్ తగ్గాయి. అయినప్పటికీ ఆమెకి మంచి బ్రేకిచ్చిన సంపత్ నంది దర్శకత్వంలో ఓదెల 2 లాంటి హీరోయిన్ సెంట్రిక్ చిత్రంలో నటిస్తుంది.
ఇక హిందీలో అవకాశాలు కోసం గ్లామర్ బాగా దట్టిస్తుంది. అందాల ఆరబోతే పనిగా పెట్టుకుంటుంది. అవకాశం ఉన్నా లేకపోయినా అందాలు చూపించడానికి ట్రై చేస్తుంది. తాజాగా పింక్ డ్రెస్ లో మిల్కి బ్యూటీ గ్లామర్ మరింతగా పెరిగిపోయింది. ఆమె రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ లో తమన్నా పింక్ అవుట్ ఫిట్ లో అదే రకమయిన సాండిల్స్ లో మెరిసిపోగా.. బ్యాగ్రౌండ్ కూడా పింక్ కలర్ లోనే ఉండడంతో ఆ పిక్ మరింతగా హైలెట్ అయ్యింది.
ఆకట్టుకునే అందంతో పాటు తమన్నా ఫోటోలకు ఫోజ్ ఇచ్చే తీరు మిగతా హీరోయిన్స్ కి చాలా అపోజిట్ గా ఉంటుంది. మిల్కి బ్యూటీ అనే పేరుని తమన్నా ఇన్నాళ్లయినా ఇంకా ఇంకా సార్ధకత చేస్తూనే ఉంది. మరి తమన్నా ఇంకా సినిమా అవకాశాలే కోరుకుంటుందో.. లేదంటే విజయ్ వర్మ ని పెళ్లి చేసుకునే విషయమై దృష్టి పెడుతుందో చూడాలి.