మెగా హీరోలంతా వెకేషన్ బాట పట్టారు. సమ్మర్ లో హైదరాబాద్ ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం మెగా ఫ్యామిలీ హీరోలు ఇతర దేశాలకి ఎంజాయ్ చెయ్యడానికి బయలు దేరారు. ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు వదిలారు. అలాగే అల్లు అర్జున్ తన భార్య స్నేహ, పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. తన మైనపు విగ్రహావిష్కరణలో పాల్గొన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి యూరప్ ట్రిప్ వెయ్యబోతున్నారనే టాక్ నడుస్తుంది. ఆయన నటిస్తున్న విశ్వంభర షూటింగ్ కి తాత్కాలిక విరామం ప్రకటించి ఈ వేసవి వేడి నుంచి కాస్త రిలాక్సేషన్ కోసం చిరు భార్యని తీసుకుని యూరప్ వెళ్ళబోతున్నారట. ఇక రామ్ చరణ్ తన పుట్టిన రోజునాడు భార్య ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నాడు.
ఈరోజు శనివారం చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ తో కలిసి వెకేషన్ కి బయలు దేరాడు. చరణ్, రైమ్ ఫ్లైట్ లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో చూడగానే.. మెగా హీరోలంతా వెకేషన్ మోడ్ లో ఉన్నారంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.