Advertisement
Google Ads BL

టీడీపీలో చేరిన టాలీవుడ్ యంగ్ హీరో


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ.. అటు ఇటు జంపింగ్‌లు, చేరికలు ఎక్కువవుతున్నాయి. సినిమాలకు రాజకీయాలకు ఎలాంటి అవినాభావ సంబందాలు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల్లోకి చేరిపోతున్నారు. ఇప్పటికే అధికార వైసీపీలో పలువురు సినీ నటీనటుమణులు ఉన్నారు.. పదవులు కూడా అనుభవించారు.. అనుభవిస్తున్నారు కూడా. ఇక టీడీపీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో టీడీపీ అంటే టాలీవుడ్.. టాలీవుడ్ అంటే టీడీపీ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అందుకే ఇప్పుడు పలువురు హీరో, హీరోయిన్లు సైతం సైకిలెక్కడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయరు కానీ.. ప్రచారం మాత్రమే చేయబోతున్నారు. అయితే ఈయన్ను స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తారా లేకుంటే ఒకట్రెండు నియోజకవర్గాలకే పరిమితం అవుతారా అనేది తెలియాల్సి ఉంది. నికిల్ టీడీపీలో చేరికతో సోషల్ మీడియా వేదికగా.. ఆయన అభిమానులు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధమే నడుస్తోంది. టీడీపీలో చేరడంపై నిఖిల్ ఎలా రియాక్ట్ అవుతారు..? విమర్శలపై ఇంకెలా స్పందిస్తారు..? అనేది తెలియాల్సి ఉంది.

Nikhil meets Nara lokesh:

Hero Nikhil has not joined TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs