విజయ్ దేవరకొండ-రష్మిక డేటింగ్ లో ఉన్నారనే న్యూస్ గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. వీరిద్దరూ తాము గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పినా వారి పెళ్లిపై వస్తున్న వార్తలకి అడ్డుకట్ట పడడం లేదు. అటు విజయ్, ఇటు రష్మిక స్నేహంగా ఉంటున్నా వీరు కలిసి వెకేషన్స్ కి తిరగడమే ఆ వార్తలు స్ప్రెడ్ అవడానికి కారణమవుతుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మరో వారంలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతుంది. ఈ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు. తాజాగా చెన్నై లో దిల్ రాజుతో కలిసి ఫ్యామిలీ స్టార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో విజయ్ పెళ్లిపై ప్రశ్న ఎదురైంది.
అయితే విజయ్ దేవరకొండ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, పిల్లలు కావాలి కదా.. కానీ ఈ ఏడాది చేసుకోను, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పడంతో పాటుగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి విజయ్ దేవరకొండ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది రష్మికనేనా.. అనేది ఇప్పుడు అందరిలో మొదలైన ఆసక్తి. చూద్దాం విజయ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో అనేది.