Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ మైల్ స్టోన్ మూమెంట్


గంగోత్రి చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ ని అప్పట్లో విమర్శించని వారు లేరు. అసలు ఇతను హీరో ఏమిటి, తండ్రి నిర్మాత, మేనమామ స్టార్ హీరో అయితే ఇలాంటి వాళ్ళని హీరోగా తీసుకొచ్చేస్తారా అన్నవాళ్ళే ఇప్పుడు అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అంటే తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయి. డ్యాన్, ఫైట్స్, నటన ఇలా అన్ని విషయాల్లో మాస్ ఆడియన్స్ ని అల్లు అర్జున్ ఆకట్టుకుని టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Advertisement
CJ Advs

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లేవెల్లో దుమ్మురేపాడు. తాజాగా అల్లు అర్జున్ దుబాయ్ లో మేడమ్ టుస్సాడ్స్ తన మైనపు విగ్రహావిష్కణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వివిధ రంగాల్లో అసమానమైన ప్రతిభ కనబర్చిన విశిష్ట వ్యక్తులకు సంబంధించిన మైనపు విగ్రహాలతో సత్కరిస్తుంటారు. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది స్టార్ నటీనటుల మైనపు విగ్రహాలు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఘనతని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన అభిమానులు ఎంతో గర్విస్తున్నారు. 

అల వైకుంఠపురుములో’ మూవీలోని ఒక స్టిల్ తో పుష్ప ఫోజ్ తో అల్లు అర్జున్ మైనపు విగ్రహం తయారు చేశారు. ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న అల్లు అర్జున్ తన మైనపు విగ్రహం ముందు ఆ విగ్రహం మాదిరి ఫొటోలకి ఫోజులిచ్చాడు. సెల్ఫీ తీసుకుంటూ సందడి చేసాడు. ముందు బ్యాక్ స్టిల్ ని రివీల్ చేస్తూ అందరిని సర్ ప్రైజ్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప ఫోజులతో ఇచ్చిన ఫ్రెంట్ స్టిల్ తో సందడి చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి.

మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహ ఆవిష్కరణ, ప్రతి కళాకారుడికి ఇదో గొప్ప మైలురాయి. ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ తన ఫొటోతో పాటుగా క్యాప్షన్ జోడించాడు.

Allu Arjun strikes iconic Pushpa pose with his wax statue at Madame Tussauds:

Allu Arjun strikes iconic Pushpa pose with his wax statue at Madame Tussauds Dubai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs