ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD మే 9 న విడుదల కాకపోవచ్చనే ఊహాగానాలకు మేకర్స్ క్లారిటీ ఇవ్వకుండా అభిమానులని కన్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇండియా వైడ్ జరగబోయే లోక్ సభ, అసంబ్లీ ఎన్నికల దృష్ట్యా కల్కి వాయిదా అనివార్యమైంది. కానీ కొత్త డేట్ ఇంకా ప్రకటించకుండా మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు. అదలావుంటే కల్కి 2898లో లోకనాయకుడు కమల్ హాసన్ అతిధి పాత్రలో కనిపిస్తానంటూ చెప్పి కొద్దిగా డిస్పాయింట్ చేసినా.. కాస్త సర్ ప్రైజింగ్ చెయ్యడంతో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.
భైరవగా ప్రభాస్ లుక్ అందరిని ఇంప్రెస్స్ చెయ్యగా.. ఇప్పుడు కల్కి 2898 AD కి కళ్ళు చెదిరే ఓటీటీ డీల్ సెట్ అవుతున్నట్టుగా ప్రస్తుతం బేరసారాల్లో ఉన్నట్లుగా టాక్ మొదలైంది. కల్కి ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది అంటున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డ్ ప్రైస్ ని కల్కి మేకర్స్ కోసం కోట్ చేసినట్లుగా తెలుస్తుంది.
దాదాపుగా 375 కోట్లు కల్కి ఓటీటీ రైట్ కోసం నెట్ ఫ్లిక్స్ ముందు కల్కి మేకర్స్ డీల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సౌత్ భాషలకి 200 కోట్లు, హిందీ భాష ఒక్కదానికే 175 కోట్లు కల్కి మేకర్స్ నెట్ ఫ్లిక్స్ ని డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్. ఈ న్యూస్ చూసాక ప్రభాస్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటుంటే. చాలామంది మాత్రం ఈ డీల్ తెగితే బిగ్ షాక్ లోకి వెళ్లేట్టుగా ఉన్నారు.