Advertisement
Google Ads BL

ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ సిద్దార్థ్-అదితి పోస్ట్


నిన్న బుధవారం సోషల్ మీడియాలో సిద్దార్థ్-అదితి రావు లు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్త గుప్పుమంది. తెలంగాణలోనే సిద్దార్థ్-అదితి రావు ల వివాహం ఎవ్వరికి తెలియకూండా అత్యంత గోప్యంగా జరిగిపోయినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. మొదటినుంచి తమ రిలేషన్ ని ఎంతో సీక్రెట్ గా మైంటైన్ చేసిన సిద్దు-అదితి లు పెళ్లి విషయంలో కూడా అంతే సీక్రెట్ ని మైంటైన్ చేసారంటూ చెప్పుకున్నారు. 

Advertisement
CJ Advs

పెబ్బేరు మండలం శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో సిద్దార్థ్, అతిథి రావు హైదరి వివాహం చేసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో అత్యంత రహస్యంగా ఈ  వివాహం జరిగింది అన్నారు. అయితే సిద్దార్థ్ కానీ, అదితి కానీ ఈ పెళ్లిపై స్పందించలేదు. ఈరోజు సడన్ గా అదితి రావు తమకి ఎంగేజ్మెంట్ అయ్యింది అంటూ చేతికి ఉన్న నిశ్చితార్ధపు ఉంగరాలుతో సిద్ధుతో కలిసి ఉన్న పిక్ ని పోస్ట్ చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది. 

అందరూ అనుకున్నట్టుగా తాము చేసుకుంది పెళ్లి కాదు జస్ట్ ఎంగేజ్మెంట్ అంటూ ప్రకటించింది. He said yes! ❤️E. N. G. A. G. E. D. 💫 అంటూ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది. సిద్దార్థ్ తో అదితి ఉన్న ఆ పిక్ క్షణాల్లో వైరల్ గా మారింది. మరి చేతికి నిశ్చితార్ధపు ఉంగరాలతో త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నామని అదితి చెప్పకనే చెప్పేసింది. 

Aditi Rao Hydari and Siddharth confirm engagement:

Aditi Rao Hyadari Gets Engaged To Siddharth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs