సినిమా వాళ్ళు, కమెడియన్స్, సీరియల్ నటులు చాలామంది రాజకీయాల్లోకి వెళ్లి తమకి ఇష్తమైన పార్టీలకి, వ్యక్తులకి ప్రచారం చెయ్యడం ఎప్పటినుంచో చూస్తున్నాం. కొంతమంది ఏ MLA గానో, ఎంపీ గానో టికెట్ ఆశించి ప్రచారం చేస్తే.. మరికొందరు ఆయా వ్యక్తులపై ఉన్న ఇష్టంతో ప్రచారం చేస్తూ ఉంటారు. రీసెంట్ రాజకీయాల్లో అలీ, పోసాని లాంటి వాళ్ళు వైసీపీ కి కొమ్ము కాస్తుంటే, ఆది, మిగతా జబర్దస్త్ బ్యాచ్ నాగబాబుకు జై కొడుతున్నారు.
తాజాగా యాంకర్ కమ్ నటి అనసూయ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది, కొన్నాళ్లుగా అనసూయ భరద్వాజ్ రాజకీయ ఎంట్రీపై వార్తలొచ్చినా.. ఆమె ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తనకి పార్టీలు ముఖ్యం కాదు అందులో ఉన్న వ్యక్తులు ముఖ్యమని చెబుతుంది. తనకిష్టమైన వ్యక్తుల కోసం తాను ఎన్నికల ప్రచారానికి రెడీ అంటుంది. జబర్దస్త్ చేస్తున్న సమయంలో తనకి నాగబాబు, రోజా ఇద్దరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఇద్దరూ పిలిస్తే ఇద్దరికీ తను ప్రచారం చేస్తానని.. తనకు పార్టీల కన్నా మనుషులు ముఖ్యమని చెబుతుంది.
తనకి ముందు నుంచి రాజకీయాలంటే నచ్చవు. అందుకోసమే తన తండ్రిని కూడా రాజకీయాలకి దూరం చేసినట్టుగా చెప్పిన అనసూయ పవన్ కళ్యాణ్ పిలిస్తే జనసేన కోసం ప్రచారం చెయ్యడానికి సిద్ధమని చెబుతుంది. మరి చాలామంది నటులు పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి సుముఖత చుపుతున్నట్టుగానే అనసూయ పవన్ వెంట నడిచేందుకు ఇంట్రెస్ట్ చూపించడం హాట్ టాపిక్ అయ్యింది.