Advertisement
Google Ads BL

ఫైనల్లీ గేమ్ ఛేంజర్ పై దిల్ రాజు అప్ డేట్


గేమ్ చెంజర్ విడుదల తేదీపై మెగా అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళు నిర్మాత దిల్ రాజుని, దర్శకుడు శంకర్ ని తిడుతున్న తిట్లు చూస్తే అర్ధమైపోతుంది. రామ్ చరణ్ బర్త్ డే కి ఖచ్చితంగా రిలీజ్ డేట్ పోస్టర్ వస్తుంది అనుకున్న మెగా అభిమానులని నిరాశపరిచింది. అయితే తాజాగా దిల్ రాజు చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో గేమ్ చెంజర్ రిలీజ్ పై సూపర్ అప్ డేట్ ఇచ్చి మెగా అభిమానులని కాస్త శాంతపరిచారు. ఓ నాలుగైదు నెలలు ఓపిక పట్టమంటూ గేమ్ చెంజర్ రిలీజ్ డేట్ పై కాస్త క్లూ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

గేమ్ చెంజర్ రిలీజ్ డేట్ పై ఖచ్చితమైన డేట్ దిల్ రాజు చెప్పకపోయినా.. అక్టోబర్ లో అంటే దసరాకి గేమ్ చెంజర్ రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన జరగనుంది జరగండి పాట గతంలో లీక్ అవ్వడం వల్ల ఇవాళ మీకు అంత ఎనర్జీ ఇవ్వలేకపోయింది అంటూ దిల్ రాజు గేమ్ చెంజర్ పాట అసంతృప్తి పై వివరణ ఇచ్చారు. అయితే గేమ్ చేంజర్లో ఉండే మూడు పాటలు థియేటర్ కుర్చీల్లో కూర్చుని చూడలేనంత గొప్పగా డాన్సులు ఉంటాయని మెగా అభిమానులని కూల్ చేసారు. 

సోషల్ మీడియాలో దిల్ మావా అప్డేట్ అంటూ నన్ను తిట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఫన్నీగా చెబుతూనే..  శంకర్ అనే శాటిలైట్ సిగ్నల్ ఇస్తే తప్ప నేను ఏం చేయలేనని గేమ్ చెంజర్ షూటింగ్ మరో రెండు నెలల్లో మొత్తం పూర్తవుతుందని చెప్పి గేమ్ చెంజర్ పై సూపర్ అప్ డేట్ ఇచ్చారు. 

Finally Dil Raju update on the Game Changer:

Dil Raju – Game Changer will be yours in five months
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs