Advertisement
Google Ads BL

బ్రేకివ్వకపోయినా పర్లేదు, ఉన్నది చెడగొట్టొద్దు


గీత గోవిందం కాంబో రిపీట్ అనగానే అందరిలో మరోసారి బ్లాక్ బస్టర్ ఆన్ ద వే అనుకున్నారు. అనుకున్నట్టుగానే పరశురామ్ విజయ్ దేవరకొండ తో ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా పబ్లిసిటీ పోస్టర్స్, టీజర్ ఇప్పడు విడుదలైన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కామెడీ తో పాటుగా ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా విడుదలైన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లోకి వెళితే.. విజయ్ దేవరకొండ లుంగీ లో సింపుల్ గా ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే స్వామి నువ్వు కొత్తగా లైఫ్ లో బ్రేక్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్ని మాత్రం చేడగొట్టకు అంటూ దేవుణ్ణి కోరుకుంటున్న సీన్ హైలెట్ అనేలా ఉంది. లిఫ్ట్ లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందుందని తాగేస్తే.. హెల్త్ అంటూ.. విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ కూడా దేవరకొండ అభిమానులని ఇంప్రెస్స్ చేసేదిలా ఉంది. 

సిస్టర్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ కష్టం మాత్రమే కాదు.. ఆ ఫ్యామిలిలో ప్రతి డైలాగ్ ఫన్ క్రియేట్ అయ్యేలా పరశురామ్ మేకింగ్ స్టయిల్ ఉండగా.. మృణాల్ ఠాకూర్ ఓమై గాడ్ నేనైతే పడిపోయానండి అంటూ ఎప్పటిలాగే క్యూట్ గా బ్యూటిఫుల్ లుక్స్ తో పడేసింది. 

కొన్నిచోట్ల గీత గోవిందం చూస్తున్నామా.. దానికి సీక్వెల్ గా పరశురామ్ ఫ్యామిలీ స్టార్ తీసాడా అని అనుకున్నా.. కొన్నిసార్లు మాత్రం విజయ్ కామెడీ డైలాగ్స్ లో కొత్తదనం కనిపించింది, తప్పు నాదన్నప్పుడు నలుగురి మధ్యలో కాళ్ళు పట్టేసుకున్న సందర్భం కూడా ఉంది అంటూ విజయ్ చెప్పే ఫన్నీ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. మృణాల్ చెంప మీద కొట్టాక విజయ్ హాయిగా ఉంది అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా కొత్తగా అనిపిస్తుంది. సో ఈ సమ్మర్ కి ఫ్యామిలి స్టార్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్ అనడంలో సందేహం లేదు. 

Family Star Trailer review :

Family Star Trailer released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs