కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ చేసినప్పటినుంచి మెగా నటుడు నాగబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. జబర్దస్త్ లో తేడాలు రావడం, నాగబాబు జబర్దస్త్ ని వదిలేసిన సమయంలోనే ఆర్పీ కూడా జబర్దస్త్ కి బై బై చెప్పేసి నాగబాబు జెడ్జ్ గా జీ తెలుగులో వచ్చిన అదిరింది షో లో చేరాడు. అది ఆగిపోయాక ఆర్పీ సినిమా డైరెక్టర్ అంటూ తిరిగి చివరికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో ఫేమస్ అయ్యాడు. అయితే ఆర్పీ నాగబాబు మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో జనసేన లో చేరకపోయినా.. వారి మీద ఉన్న అభిమనంతో వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిని ఓ ఇంటర్వ్యూలో ఏసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. నెల్లూరుపెద్దా రెడ్డి చేపల పులుసు బ్రాంచ్ లు ఓపెన్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటర్వూస్ ఇస్తున్న ఆర్పీ విజయసాయి రెడ్డిని విమర్శించడంపై వైసీపీ నేతలు, అభిమానులు ఆర్సీని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఆర్పీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ సాయి రెడ్డిది నెల్లూరు అని ఎంతమందికి తెలుసు. ఎవ్వరికి తెలియదు, ముత్తుకూరు మండలం తాళ్లపూడి ఆయనిది. నెల్లూరు నుంచి పోయి జగన్ మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో నువ్వు ఏదైనా చెయ్యొచ్చు. అసలు నీది నెల్లూరు జిల్లా అనే ఎవ్వరికి తెలియదు. అక్కడ ఎంపీ గా పోటీ చేస్తున్న వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే గెలస్తారు. నువ్వు ఏం చేసినా గెలవలేవు, అక్కడ ఎయిర్ పోర్ట్ వేసి పేద ప్రజలకి ఏం చేద్దామనుకుంటున్నావ్. అతనొక ఏ2 ఖైదీ. అతను శుక్రవారం శుక్రవారం కోర్టులో సంతకం పెట్టాలి. ఇక్కడ నెల్లూరులో పొరపాటున ఎంపీ అయ్యాడంటే ఇంకేం లేదు, ఫ్లైట్ ఎక్కి సంతకం చెయ్యడానికి వెళ్లిపోతాడు. అంటూ విజయ్ సాయి రెడ్డిని కిర్రాక్ ఆర్పీ ఓ రేంజ్ లో ఏసుకున్నాడు.
జగన్ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళ మందు తాగి సచ్చిపోతున్నారు. ఒకప్పుడు లవర్స్ లేక సచ్చే వాళ్ళు, ఇప్పుడు లివర్లు పోయి సచ్చిపోతున్నారు అంటూ ఆర్పీ వైస్ జగన్ ప్రభుత్వంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. రాజకీయంలో నేను ఒక రూపాయి ఆశించకుండా నెల్లూరులో పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డిగారి తరుపున ప్రచారం చేస్తాను అంటూ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
దానితో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో ఆర్పీ పై నోరు పారేసుకుంటున్నారు. నువ్వెంత నీ బ్రతుకెంత అంటూ వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా ఆర్పీ ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.