Advertisement
Google Ads BL

చరణ్‌కు బన్నీ నాటు నాటు విష్


గత ఏడాది అల్లు అర్జున్.. రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో కనిపించలేదు. తన ఫ్యామిలీ, రామ్ చరణ్ సిస్టర్స్‌తో కలిసి వెకేషన్స్‌కి వెళ్ళాడు, పార్టీకి రాలేదు. సరే సోషల్ మీడియా వేదికగా అయినా రామ్ చరణ్ కి అల్లు అర్జున్ విషెస్ చెప్పాల్సింది, కానీ అల్లు అర్జున్.. రామ్ చరణ్ మీద అసూయతోనే విష్ చెయ్యలేదు అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. అల్లు అర్జున్-రామ్ చరణ్ బావ బావమరుదులు, కానీ వారి మధ్యన కెరీర్ పరంగా ఉండే ఈగోలు ఉంటాయి. వారి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి.

Advertisement
CJ Advs

అయితే ఈ ఏడాది కూడా రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు అల్లు అర్జున్ హైదరాబాద్‌లో లేడు. దుబాయ్‌లో ఆయన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. అది కూడా రామ్ చరణ్‌తో కలిసి నాటు నాటు స్టెప్స్ వేస్తున్న వీడియో‌ని షేర్ చేస్తూ రామ్ చరణ్‌కి అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. Happy Birthday to my most Spl Cousin. Love you always 🖤 అంటూ చరణ్ కి అల్లు అర్జున్ చెప్పిన క్యూట్ బర్త్‌డే విషెస్ వైరల్‌గా మారాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో వారి మధ్యన అగాధాన్ని సృష్టించే బ్యాచ్ ఏం మాట్లాడుతుందో చూడాలి అంటూ మెగా-అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Allu Arjun Special Birthday wish to Ram Charan:

Icon Star Allu Arjun Naatu Naatu wish to Global Star Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs