Advertisement
Google Ads BL

అందుకే బాలీవుడ్‌కి వెళ్ళలేదు: త్రిష


చాలామంది సౌత్ హీరోయిన్స్ ఫైనల్ టార్గెట్.. బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ టాప్ రేంజ్ పొజిషన్‌కి వెళ్ళాలి అంటూ కలలు కంటూ ఉంటారు. అలా వెళ్లిన వాళ్లలో చాలామంది హిందీలో సక్సెస్ కాలేక వెనుదిరిగి సౌత్‌కే వచ్చేయగా.. ఒకరో ఇద్దరో హిందీలో సెటిల్ అయ్యారు. ఇక సౌత్‌లో ఎన్నో ఏళ్ళుగా స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తూ.. ఇప్పటికీ హీరోయిన్‌గా బిజీగా ఉన్న నటి త్రిష. మధ్యలో ఆమె కెరీర్ డౌన్ అయ్యింది.. ఇంకేంటి త్రిష పనైపోయింది అనుకున్నారు. కానీ పొన్నియన్ సెల్వన్‌తో మరోసారి త్రిష హ్యాండ్ రేజ్ అయ్యింది.

Advertisement
CJ Advs

నాలుగు పదుల వయసులోనూ త్రిష ఇప్పటికీ బిజీ తారగానే కనిపిస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటున్న త్రిష.. ఒకప్పుడు హిందీలోకి వెళ్లి ఒక సినిమా కూడా చేసింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ హిందీ వైపు చూడలేదు. దాంతో ఆమెకి హిందీ అవకాశాలు రాలేదనే ప్రచారం జరిగింది. అయితే త్రిష మాత్రం తాను హిందీలో సక్సెస్ కాలేక వెనుతిరగలేదు, తాను తన ఫ్యామిలీని ముంబై‌కి మార్చాలని అనుకోకపోవడం వల్లనే అంటూ చెప్పుకొచ్చింది.

అలా చేయాలంటే సౌత్‌లో చాలామందిని వదులుకోవాలి. అంతేకాకుండా బాలీవుడ్‌లో తన కెరీర్‌ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. అంత ఆసక్తి అప్పట్లో తనకి లేకపోవడంతోనే.. మళ్లీ హిందీలో ట్రై చేయలేదని చెప్పింది త్రిష. అంతేకానీ తనకి అవకాశాలు రాక బాలీవుడ్‌కి వెళ్లకుండా మానేయలేదని త్రిష స్పష్టం చేసింది.

Trisha About Bollywood Entry and Chances:

Trisha Says Thats why she didnt go to Bollywood  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs