Advertisement
Google Ads BL

నందమూరి నాల్గవతరం వారసుడు రెడీ


నందమూరి తారకరామారావు.. సీనియర్ ఎన్టీఆర్‌గా సినిమా ఇండస్ట్రీని ANR తో కలిసి ఏలారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌కి వారసుడిగా చిరు, వెంకీ, నాగ్ సరసన ఇప్పటికీ తన సత్తా చాటుతున్నారు. నందమూరి హరికృష్ణ బాలయ్య అంత కాకపోయినా.. ఆయన కూడా యాక్టర్‌గా తన మార్క్ చూపించారు. ఆ తర్వాత నందమూరి వారసులలో అంటే మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కొనసాగుతున్నారు. తారకరత్న నటుడిగా సుపరిచితుడే. ఇంకా బాలయ్య వారసుడు మూడో తరం వారసుల్లో నటుడిగా తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతుంది.

Advertisement
CJ Advs

ఇంతలోపులో నందమూరి నాలుగో తరం వారసుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ అభిమానులను యమా ఖుషి చేస్తోంది. హరికృష్ణ కొడుకు జానకి రామ్ పెద్ద కుమారుడు తారకరామారావు సినిమా ఇండస్ట్రీలో కాలు మోపబోతున్నాడట. అది కూడా నందమూరి వంశానికి వీరాభిమాని అయిన YVS చౌదరి దర్శకత్వంలో జానకి రామ్ కుమారుడు తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫొటోతోనే తన బ్యానర్ బొమ్మరిల్లుని మొదలుపెట్టిన వైవిఎస్ చౌదరి తారకరాముని బాధ్యతలు తీసుకున్నారట.

కొన్నేళ్లుగా ఫామ్‌లో లేని వైవిఎస్ చౌదరి జానకిరామ్ కుమారుడు తారకరాముణ్ణి ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం ఒక యూత్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే నందమూరి నాలుగో తరం వారసుడి సినీరంగ ప్రవేశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

YVS Chowdary To Introduce Fourth Generation Of Nandamuri Clan:

YVS Is Back With A Bang
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs