రామ్ చరణ్ బర్త్ డే రోజున సుకుమార్ తో మూవీపై అఫీషియల్ అనౌన్సమెంట్ ఉంటుంది అనుకుంటే రామ్ చరణ్ పుట్టిన రోజుకి రెండు రోజుల ముందే RC17 ని ప్రకటించి మెగా ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ తో రంగస్థలం కాంబో రిపీట్ అంటూ RC17 ని హోలీ రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ షూటిగ్ ముగించే పనిలో ఉండగా బుచ్చిబాబుతో RC16 ని పట్టెక్కించే పనిలో ఉన్నాడు.
గతంలో రంగస్థలం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుక్కు-చరణ్ లు ఈసారి ఎలాంటి జోనర్ లో రాబోతున్నారో అనే విషయంలో అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అయితే జోనర్ విషయం పక్కనబెడితే రాజమౌళి కుమారుడు SS కార్తికేయ RC17 ఓపెనింగ్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ సెట్స్ మీదున్నప్పుడే సుకుమార్ చరణ్ తో చెయ్యబోయే మూవీ కోసం కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారని న్యూస్ సినిపించింది.
ఇప్పుడు అదే నిజమని కార్తికేయ ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ గ్యాప్ లో సుకుమార్ తో సినిమాపై చరణ్ చెప్పారు. సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి నాతో చరణ్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. నేనైతే ఐదు నిమిషాలు కంట్రోల్ తప్పాను. అప్పటి నుంచి సుకుమార్-చరణ్ కాంబో ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా.. ఎప్పుడు తెరపై చూస్తానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఫైనల్లీ అఫీషియల్ గా RC17 ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అందులో ఐకానిక్ సీక్వెన్స్ లో ఒకటిగా చరణ్ చెప్పింది ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు మించి దీనిపై ఇంకేమి రివీల్ చేయాలని అనుకోవడం లేదు అంటూ కార్తికేయ పెట్టిన ట్వీట్ తో మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.