మెగా హీరో వరుణ్ తేజ్ గత ఏడాది తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మెగా-అల్లు-లావణ్య ఫ్యామిలీ మధ్యన ఇటలీ వేదికగా అంగరంగవైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ లో వివాహం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు తర్వాత హైదరాబాద్, డెహ్రాడూన్ రెసెప్షన్స్ కోసం టైమ్ కేటాయించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ కోసం సమయం వెచ్చించడంతో ఈ జంట అప్పట్లో హనీమూన్ కి వెళ్ళలేదు.
మధ్యలో ఫ్యామిలీతో కలిసి వెంగుళూర్ వెళ్లి సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్-లావణ్య లు తాజాగా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని పోస్ట్ చేసారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ తో పాటుగా.. Chasing sunsets on the trails!🌄అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ పిక్స్ లో వారిద్దరూ ట్రెక్కింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే సన్ సెట్ ని అతి దగ్గరగా చూస్తూ సరదాగా తీసుకున్న సెల్ఫీలు కూడా వైరల్ గా మారాయి.
మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టాక లావణ్య త్రిపాఠి నటనకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఫోటో షేర్ చేస్తూ సందడి చేస్తుంది.