Advertisement
Google Ads BL

జనసేన మరో జాబితా రిలీజ్..


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే అటు జనసేన.. ఇటు టీడీపీ పలువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 18 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో పవన్ పోటీ ఎక్కడ్నుంచి అనేది మరోసారి క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది.

Advertisement
CJ Advs

అభ్యర్థులు వీరే..

పిఠాపురం : పవన్ కల్యాణ్

నెలిమర్ల : లోకం మాధవి

అనకాపల్లి : కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్ : పంతం నానాజీ

రాజానగరం : బత్తుల రామకృష్ణ

తెనాలి : నాదెండ్ల మనోహర్

నిడదవోలు : కందుల దుర్గేష్

యలమంచిలి : సుందరపు విజయ్ కుమార్

పి. గన్నవరం : గిడ్డి సత్యనారాయణ

రాజోలు : దేవ వరప్రసాద్

తాడేపల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్

భీమవరం : పులపర్తి ఆంజనేయులు

నరసాపురం : బొమ్మిడి నాయకర్

ఉంగటూరు : పత్సమట్ల ధర్మరాజు

పోలవరం : చిర్రి బాలరాజు

తిరుపతి : ఆరణి శ్రీనివాసులు

రైల్వే కోడూరు : యనమల భాస్కరరావు

కాగా.. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో జనసేన ఏ మాత్రం పునరాలోచన చేయలేదని స్థానిక నేతలు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. ఆరణికి టికెట్ ఇవ్వొద్దని పదే పదే నిరసనలు, ధర్నాలు.. కూటమిలోని టీడీపీ, బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ వాటన్నింటినీ పవన్ లెక్కజేయట్లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు టికెట్ ఇస్తే అస్సలు సహకరించేది లేదని తేల్చిచెప్పేశారు. ఈ పరిస్థితుల్లో ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి. అయితే పవన్ మాత్రం కచ్చితంగా తన అన్న గెలిచిన తిరుపతి నుంచి జనసేన గెలిచి తీరాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి నేతలు, క్యాడర్.. కూటమి కూడా అలాగే ఉంటే సరే.. లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక పి. గన్నవరం నుంచి మహాసేన రాజేష్‌కు టీడీపీ సీటివ్వగా తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పుకున్నారు. ఈ సీటు జనసేన ఖాతాలోకి వచ్చింది.. మరి జనసేన ఏ సీటును వదులుకుంటుందనేది తెలియట్లేదు.

Third list of Janasena candidates:

Janasena Third List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs