అనసూయ అందం గురించి పదే పదే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంకర్ నుంచి నటిగా టర్న్ అయినా గ్లామర్ విషయంలో ఎక్కడా తగదు. హీరోయిన్స్ కి గ్లామర్ పరంగా గట్టి పోటీ ఇచ్చే అనసూయ ఇప్పుడు వెండితెర మీద అద్భుతమైన విజయాలు అందుకుంటుంది. రీసెంట్ గా రజాకార్ మూవీతో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన అనసూయ ఆ సినిమా ప్రమోషన్స్ లో అందమైన చీర కట్టుతో బ్యూటిఫుల్ గా మెస్మరైజ్ చేస్తుంది.
కాస్త బరువు పెరిగినా అందం చూపించడంలో అనసూయ మాత్రం లెక్కలు వేసుకోదు. 40 ప్లస్ లోను గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న అనసూయ సోలో గా తన కేరెక్టర్ కి ఎక్కువ ప్రాధ్యానత ఉంటే విమెన్ సెంట్రిక్ మూవీస్ లోను సత్తా చాటుతుంది. ప్రెజెంట్ పుష్ప 2 ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ అవకాశమొచ్చినప్పుడల్లా షాప్ ఓపెనింగ్స్ లో రిబ్బన్ కటింగ్స్ చేస్తుంది.
ఇక తరచూ సోషల్ మీడియాలో కొత్త ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తోంది. అనసూయ నటి ప్లేస్ లోకి వెళ్ళిపోయినా.. ఇంకా ఇంకా 25 ఏళ్ళ హీరోయిన్ లా కనిపించడానికే తాపత్రయపడుతుంది.