Advertisement
Google Ads BL

యూట్యూబ్ ఛానల్స్ పై KTR ఫైర్


BRS అధినేత KCR కుమార్తె, మాజీ మంత్రి KTR  సోదరి కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి  జైలులో ఇది. ఆమె బెయిల్ కోసం KTR, హరీష్ రావు, ఆమె భర్త విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత కి కోర్టు రిమాండ్ విధించింది, దానితో KTR, కవిత అమ్మగారు శోభా కవితని కలవడానికి జైలుకి వెళ్లారు. అయితే కవిత అరెస్ట్ పై ఛానల్స్ లోను, యూట్యూబ్ ఛానల్స్ లో పదే పదే వార్తలు రావడమే కాదు, కవిత పై యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వార్తలు రాయడంతో KTR ఫైర్ అవుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్స్ పై KTR చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నాము. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాము. 

గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాము. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము. 

ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని  హెచ్చరిస్తున్నాము.. అంటూ KTR ట్వీట్ చేసాడు.

KTR Fire on Youtube Channels:

KTR Tweet On Fake YouTube Channels
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs