తెలుగు, తమిళంలో ఒక్కసారిగా పాపులర్ అయిన ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ క్రేజీ తారగా కనిపిస్తుంది. మొన్నీమధ్యవరకు యంగ్ హీరోస్ తో సినిమాలు చేసిన ప్రియాంక ఇప్పుడు స్టార్ హీరోల అవకాశాలతో అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో OG చిత్రంలో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. టాలీవుడ్ యంగ్ హీరోస్ అయిన శర్వానంద్, నాని చిత్రాల్లో క్యూట్ గా బ్యూటిఫుల్ గా సింపుల్ లుక్స్ తో ట్రెడిషనల్ గా కనిపించిన ప్రియాంక మోహన్ గ్లామర్ పరంగా వీక్ అనే చెప్పాలి.
ఎప్పుడూ పద్దతిగా కనిపిస్తుంది తప్ప మోడ్రెన్ అవుట్ ఫిట్స్ జోలికి వెళ్ళదు. ప్రియాంక మోహన్ సోషల్ మీడియాల్లోను ఈమధ్యన స్పీడ్ గా ఉంది. తాజాగా ఈ బ్యూటీ ఒక అందమైన ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇందులో బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఫ్రాక్ ని ధరించి బెడ్ పై గ్లామర్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో ప్రియాంక అల్ట్రా స్టైలిష్ గా గ్లామరస్ గా కనిపిస్తోంది. కొంతమందైతే ప్రియాంక మోహన్ మోడ్రెన్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ బ్యూటీలో ఇంత మార్పు స్టార్ అవకాశాలే అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరోపక్క ఇతర గ్లామర్ హీరోయిన్స్ తో పోటీపడి పది కాలాలు యాక్టింగ్ లో కనిపించాలంటే ఈ మార్పు తప్పదంటున్నారు.
ఏది ఏమైనా ఆమె అభిమానులు ప్రియాంక ఫోటోలను వైరల్ గా షేర్ చేస్తుంటే అవి నెట్టింట సంచలనంగా మారాయి.