Advertisement
Google Ads BL

సొంతూరు కోసం ప్రభాస్ పెద్ద మనసు


చాలామంది హీరోలు అధిక పారితోషకాలు అందుకోవడమే కాదు.. అందుకు తగ్గ మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ సహా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తో ఎంతోమందికి సహాయపడుతున్నారు. అలాగే ఇంకా చాలామంది హీరోలు, హీరోయిన్స్ అనాధాశ్రమాలకు, వృద్దులకు సహాయం చేస్తే.. మహేష్ ఎన్నో వందల కుటుంభాలను ఆదుకుంటూ ఉచిత గుండె ఆపరేషన్స్ చేయించారు. సమంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా సహాయాలు చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ ఒక అడవిని దత్తత తీసుకున్నారు. అంతేకాదు ఇప్పుడు తన సొంతూరు మొగల్తూరు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమయ్యారనే న్యూస్ వైరల్ గా మారింది. ఈమధ్యనే పెదనాన్న కృష్ణం రాజుగారు మరణించినప్పుడు ప్రభాస్ తన పెద్దమ్మతో కలిసి చాలా ఏళ్ల తర్వాత మొగల్తూరుకి వెళ్లి వచ్చారు. అక్కడ అశేష అభిమానగణానికి పెదనాన్న జ్ఞాపకార్ధం అద్భుతమైన ఆతిధ్యం అందించారు. ఇప్పుడు మొగల్తూరు కోసం ప్రభాస్ 200కోట్లు ఖర్చు చేసి శ్రీమంతుడిగా మారబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రభాస్ మొగల్తూరుకి కావాల్సిన వసతులను ఏర్పాటు చెయ్యడానికి పూనుకున్నారట. అక్కడ రోడ్స్ దగ్గర నుంచి మంచి నీటి వసతులు, ఇంకా చాలా విషయాల్లో ప్రభాస్ సహాయం అందించబోతున్నారట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ వార్త చూసిన వారు ప్రభాస్ మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Prabhas has a big heart for Mogalturu:

Prabhas to spend 200 cr on Mogaltur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs