వరలక్ష్మి శరత్ కుమార్ తన జీవితంలో పెద్ద తప్పు చేశాను అంటుంది. ప్రస్తుతం నటిగా తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈమధ్యనే తన బాయ్ ఫ్రెండ్ నిక్కోలాయ్ సచ్ దేవ్ ని ఎంగేజ్మెంట్ చేసుకుంది. పెళ్ళికి రెడీ అవుతున్న సందర్భంలో తన కెరీర్ ని తానే పాడు చేసుకున్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 18 వయసులోనే నటిగా అడుగుపెట్టాను, అప్పుడే తనకి బాయ్స్ లాంటి కొన్ని చిత్రాల్లో అవకాశాలు వచ్చినా అపుడు మా తండ్రి శరత్ కుమార్ చిన్న పిల్లవి ఇలాంటి సినిమాలు వద్దు అని వారించారు.. అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఆ తర్వాత 22 ఏళ్ళ వయసులో వరలక్ష్మి హీరో ధనుష్ తో నటించిన పోడాపోడి అంటూ చేసిన చిత్రం ఆమెని నిరాశ పరిచింది. ఆ తర్వాత అనుకున్న అవకాశాలు ఆమె చేతికి అందలేదు. అయితే తన వ్యక్తిగత జీవితం, తన కెరీర్ తాను ప్లాన్ చేసుకున్నట్టుగా జరగలేదు అని చెప్పింది. తాను పోడాపోడి చేసినప్పుడు వయసు 22 ఏళ్ళు. ఆ తర్వాత 28 ఏళ్ళ లోపు స్టార్ నటిగా ఎదగాలని అనుకున్నాను. ఇక పర్సనల్ లైఫ్ లో 32 ఏళ్ళకి పెళ్లి చేసుకుని 34 ఏళ్ళకి పిల్లలని కాని సెటిల్ అవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. అలా నా జీవితంలో, కెరీర్ లో నేను ప్లాన్ చేసుకున్నట్టుగా ఏది జరగలేదని చెప్పింది.
పోడాపోడి తర్వాత తాను వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా దృష్టి పెట్టాను, అదే తాను చేసిన పెద్ద తప్పు అని, అప్పుడే నేను సినిమాలపై దృష్టి పెట్టి ఉంటే బావుండేది, ఎక్కువ సినిమాలు చేసేదాన్ని.. తన కెరీర్ లో వైఫల్యాలే తనని దృఢంగా మార్చాయని చెప్పుకొచ్చింది.