మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయల మాదిరి వెలుగొందుతుంది, రెండేళ్లలోనే టాప్ చైర్ కి ఎక్కేస్తుంది అనుకున్న వాళ్ళకి ఆమె నటించిన సినిమాలు వరసగా ప్లాప్ అవడంతో షాక్ తిన్నారు. టాలీవుడ్ లోకి క్రేజీ బ్యూటీగా అడుగుపెట్టి యంగ్ అండ్ స్టార్ హీరోల ఛాన్స్ లతో అల్లాడించిన శ్రీలీల కి టైమ్ కలిసి రావడం లేదు. ఒకప్పుడు ఆమె అదృష్టాన్ని పొగిడిన వారే ఇప్పుడు ఆమెని విమర్శిస్తున్నారు. మెచ్యూరిటీ లేకుండా సినిమాలు ఒప్పుకుని కెరీర్ ని బాగా డౌన్ చేసుకుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.
మహేష్ గుంటూరు కారం తో కమ్ బ్యాక్ అవ్వొచ్చు అనుకున్న శ్రీలీలకి అందులోని ఆమె కేరెక్టర్ ఆమెని మరింత విమర్శల పాలు చేసింది. ఇక శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే విజయ్ దేవరకొండ తో VD12 చిత్రాలు ఉన్నాయి. ఉస్తాద్ మళ్ళీ ఎపుడు సెట్స్ మీదకి వెళుతుందో తెలియదు, VD12 చిత్రం అప్డేట్ కూడా కనిపించడం లేదు. అయితే షూటింగ్స్ కి దూరంగా శ్రీలీల ఇప్పుడేం చేస్తుందో అనే అతృత ఆమె అభిమానుల్లో కనిపిస్తుంది.
అయితే శ్రీలీల ప్రస్తుతం తన ఖాళీ సమయాన్ని చదువు కోసం కేటాయిస్తుంది. ఆమె గత ఏడాది సినిమా షూటింగ్స్ వలన కొన్ని ఎగ్జామ్స్ ని పక్కనపెట్టగా.. ఇప్పుడు ఆ పరీక్షలు రాసేందుకు ఆమె ప్రిపేర్ అవుతుందట. సో ఆమెకి సినిమాలు, షూటింగ్స్ లేకపోయినా.. డాక్టర్ గా తన చదువుని కంప్లీట్ చేసే అవకాశం అయితే దొరికింది.