విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కుమార్తె పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఆయన రెండో కుమార్తె హయవాహిని వివాహం రీసెంట్ గానే విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఆ పెళ్లి పనుల హడావిడిలో ఉన్న వెంకీ ఇకపై రానా నాయుడు సీజన్ 2 కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆయన ముంబై వెళ్లి రానా నాయుడు షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత వెంకీ తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట.
Venky75 గా సైంధవ్ చిత్రం చేసిన ఆయనకి ఆ చిత్ర రిజల్ట్ నిరాశనే మిగిల్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ వెంకీ అభిమానులని ప్రేక్షకులని నిరాశ పరిచింది. ఇక వెంకీ తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపాటి దర్శకత్వంలో చేస్తారనే టాక్ ఉంది. అధికారిక ప్రకటన అయితే లేదు కానీ.. వెంకీ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఫైనల్ అవడం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని విలేజ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకోవడమే కాదు.. ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.
Venky76వ మూవీగా రూపొందనున్న ఈ మూవీ మే నెలాఖరు లేదా జూన్ నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.